ప్రకాశం జిల్లా దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్ వెంకటా కృష్ణారెడ్డి అనంతపూర్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పై స్పందించారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు అన్నారు అవి ఇవ్వలేదన్నారు. మూడు సిలిండర్ల పథకంలో ఒక సిలిండర్ కు మాత్రమే నగదు జమైందన్నారు.