ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని చాటుకుందని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రహమత్ హుస్సేన్ అన్నారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదింపజేసిన సందర్భంగా సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా కెసిఆర్ అధికారంలో ఉండి బిసిలను అణద్రొక్కారని, గతంలో చేసిన బిల్లు బిసిలకు మరణశాసనంగా ఉండేదని తెలిపారు.