కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీపీఎస్ ఆర్డినెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. పాత ఓపీఎస్ పద్ధతిని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.