జుక్కల్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం, నిలిచిపోయిన రాకపోకలు... గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒక ప్రక్క పంటలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా, మరోపక్క లోలెవల్ బ్రిడ్జిలపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జుక్కల్ నియోజక వర్గం లోని మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్, పిట్లం మండలంలోని పలు గ్రామాల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్నూర్ - సోముర్ , హంగర్గ - మాదాపూర్ గ్రామాల మధ్య వాగులు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ మార్గ