శనివారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలోని ఒంటల్‌పేట్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్,వైద్యుల హాజరు,ఓపీ నమోదు, సిబ్బంది హాజరు, ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్ అమలు,మందుల లభ్యత తదితర అంశాలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలు జిల్లా స్థాయిలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.