శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్వరాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించడం వల్ల మెరుగైన వైద్య చికిత్సలు అందించవచ్చు అన్నారు జిల్లాలోని గురుకుల పాఠశాలలు కేజీబీవీలు అన్ని వసతి గృహాలలో విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.