ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ సుబ్బారావు మాట్లాడుతూ సీసీ కెమెరాల సహాయంతో బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రెండు బైకులను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తమ వాహనాలను బస్టాండ్ రైల్వేస్టేషన్లో పార్కింగ్ ప్లేస్ లలోనే పెట్టాలని తెలిపారు.