యాడికి మండలం కమలపాడు గ్రామంలోని గ్రామ కంఠానికి సంబంధించిన చెట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సోమవారం కమలపాడు గ్రామానికి వెళ్లారు. చెట్లు నరికి వేసిన వారిపై ఆరా తీశారు. చెట్లు నరికివేత ఘటనపై గ్రామంలోనే విచారణ చేపట్టారు.