శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 314.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పుట్టపర్తి కలెక్టరేట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో వెల్లడించారు. హిందూపురం మండలంలో అత్యధికంగా 32.2 మి.మీ, అమడగూరు 30.2 మి.మీ, రోళ్ల 29.4 మి.మీ, సోమందేపల్లి 24.2 మి.మీ, పరిగి 19.6 మి.మీ, చిలమత్తూరు 19.2 మి.మీ, మడకశిర 19.0 మి.మీ, అగళి 18.2 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అత్యల్పంగా ముదిగుబ్బ మండలంలో 1.4 మి.మీ నమోదు అయ్యిందని తెలిపారు. 7 మండలాల్లో వర్షం కురవలేదన్నారు