శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రైతు యవ్వారి వైకుంఠరావు విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీరు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లిన వైకుంఠరావు చీకటి పడినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నారు. మోటారు వేసే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.