జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని విఘ్నేశ్వరుని ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.