Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సెమిరెసిడెన్షియల్ పాఠశాల, కోర్కీశాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య తరచూ విభేదాల కారణంగా ఫుడ్ పాయిజన్ ,కలుషిత నీరు తీసుకోవడం వల్ల,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫెర్టిలైజర్ మందును ఒక బాటిల్ లో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో కలపడం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, ముక్కు పచ్చలారని విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకున్న వారిపై ఉద్యోగాల నుంచి తీసివేయడం కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు.