డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను దేవనకొండలో జనసేన నాయకులు ఉచ్చిరప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ పరిశుభ్రతకు సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి శాలువాలతో సన్మానించారు. సమాజానికి కీలకంగా నిలుస్తున్న వారి సేవలను గుర్తించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు రంగా, బండ్లయ్య, రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.