విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.నరసరావుపేటలో గురువారం స్థానిక గాంధీ పార్క్ వద్ద బషీర్ బాగ్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. 2000 సంవత్సరంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ, బాలస్వామి పోలీసుల తూటాలకు అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు.