ఆరుగాలం కష్టపడే రైతుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. ఒక వైపు పంటలు సాగు చేయడానికి ప్రకృతి సహకరించక, కావలిసిన ఎరువుల మందులు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుండే మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు కార్యాలయం వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.యూరియా బస్తాల కోసం రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రైతులకు సరిపడా యూరియా ను సరఫరా చేయాలని కోరుతున్నారు. యూరియా లోడు రావడంతో బారులు తీరిన రైతులు. ఎక్కువమంది రావడంతో ఒక రైతుకు ఒక యూరియా