తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మతల్లి జాతరకు ఫెస్టివల్ కమిటీని శనివారం ప్రభుత్వం నియామకం చేసింది. ఈ కమిటీలో గొల్లగుంట మురళి, రామరావు, అనిల్, తాండవ చంద్ర, పుట్టా శివ, టీవీ కృష్ణ, జలూద్ యామినీ, పులికొల్లు రాజేశ్వరి, కలపాటి, నాగమణి, తిండీ వనం ప్రసాద్, చంజీ తిరుపతి రావు, మదనపల్లి సావిత్రమ్మ, వేదగిరి సత్య సాయి కిరణ్మయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ 7 నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మరియు సీఐ ఏవి రమణ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు