రాజంపేట ను జిల్లా కేంద్రం చేయాలని శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. రాజంపేట కేంద్రంగా జిల్లా చేయాలని చైర్మన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు అందరూ తమ ఆమోదం తెలిపారు.. ఈ సమావేశంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.