స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం పాఠశాల చిన్నారులు తమ చిట్టి చేతులతో ఎకో ఫ్రెండ్లీ గణనాధులను తయారు చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ గణపయ్యాలనే పూజించాలని తెలియజేస్తూ చిన్నారులు ఉత్సాహంగా ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేశారు.వివిధ రూపాలలో వినాయక ప్రతిమలను అందంగా రూపొందించారు. మట్టి గణపయ్యలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పలు రకాల కూరగాయలతో, పండ్లతో ,పూలతో ,దినుసులతో, బియ్యం, బిస్కెట్స్ , ఇడ్లీ, ఆకులు పలు రకాల ఆకృతులలో గణనాధులకు రూపం ఇచ్చారు.అనంతరం చిన్నారులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ గణపయ్యలతో నగరంలోని పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.