ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్ ని బుధవారం డి.ఎస్.పి సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డు పరిస్థితి నుంచి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి డిఎస్పి తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించి సైబర్ నేరాలపై పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు.