జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన రక్తాన్ని అందించేందుకు 200 యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు విభాగాల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.