వికారాబాద్ జిల్లా నవపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బండయ్య గౌడ్ తో పాటు, ఆక్నపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ తో పాటు 100 మంది కాంగ్రెస్ నేతలు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. గ్రామ గ్రామాన అందరూ టిఆర్ఎస్ వైపు చూస్తున్నారని. ఇచ్చిన హామీల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజా పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు.