కరకగూడెం 108 అంబులెన్స్ EMT గా పనిచేస్తూ 2024 డిసెంబర్ 13 వ తేదీన దోమల ప్రణయ్ అనే యువకుడు మరణించారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నుంచి మంజూరైన రూ. 5లక్షల రూపాయల చెక్కును మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ 108 స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్,ఉద్యోగి నామినీకి అందజేశారు. దీంతో బాదిత కుటుంబ సభ్యులు సంతృప్తి ని వ్యక్తం చేశారు.