అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో బుధవారం నుంచి వినాయక చవితి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి దుర్గా భవాని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసామన్నారు.