ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం వరద ఉద్ధృతి తగ్గడంతో అటవీ శాఖ అధికారులు నేడు ఆదివారం రోజున స్విమ్మింగ్ పూల్లోకి దిగేందుకు అనుమతి కల్పించారు. దీంతో పర్యాటకులు ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ, ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులు చెప్పిన సూచనలు పాటించాలని, నిబంధనలను అతిక్రమించొద్దని రేంజర్ చంద్రమౌళి సూచించారు. లోతులోకి వెళ్లొద్దని ఆయన కోరారు.