ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ గ్రామం వద్ద లోతట్టు వంతెన వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఆదిలాబాద్ నుంచి కరంజి, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించింది. మరోవైపు చెట్లు విరిగి పడి నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పలు పంట పొలాలలో వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.