నారాయణపేట న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్. నాగేశ్వరి ఆదివారం మహబూబ్ నగర్ జైలును సందర్శించారు. జైలు సూపరింటెండెంట్ ను కలిశారు. అక్కడ జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడుతూ వారికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ ద్వారా మంచి జరుగుతుందని తెలిపారు. ఖైదీలకు భోజనాలు సరైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ గురించి వివరించారు. అప్పుడే ఇద్దరు ఖైదీలను విడిపించినట్లు ఆదివారం 4 గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు.