తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేవారు. ఆలయ ఛైర్మన్ చంద్రమోహన్, ఈవో రామాంజనేయులు అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ స్వాగతం పలికారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రావణమాసం పురస్కరించుకొని సతీసమేతంగా జేసీ ఉమాదేవితో కలిసి విశేష పూజలు గావించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.