నల్గొండ జిల్లా: గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సూచించారు. గురువారం ఆమె నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఐ రిస్క్ ఏఎంసీ కేసులు కుక్క కాటుకు యాంటీ రెబిస్ వ్యాక్సినేషన్ ఈడిడి క్యాలెండర్ ఆసుపత్రిలో మందుల అందుబాటు మలేరియా డెంగ్యూ పరీక్షల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అప్పాజీపేట లో ఉన్న చందుపట్ల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు.