అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న తాటిచెర్ల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తాటిచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డి తన వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయి మృతి చెందినట్లుగా గ్రామస్తులు సాయంత్రం గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.