గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల సీఐ సంపత్ కుమార్ సూచించారు.మంగళవారం బిక్కనూర్లో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒకరు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. నిమజ్జనం రోజు డీజీలు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.