పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సర్కిల్ లో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9:30 కు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ తో వాహనదారులను తనిఖీ చేశారు. ఎనలైజర్ లో రీడింగ్లను బట్టి సుమారు ఎనిమిది మందిని అదుపులోనికి తీసుకొని ఉదయం కోర్టుకు పంపించనున్నారు. బ్రీత్ అనలైజర్ రీడింగ్ ద్వారా కోర్టు వారికి ఫైన్ విధిస్తుంది.