అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.