పల్నాడు జిల్లా,నరసరావుపేటలో డీజిల్ దొంగల ముఠా హల్చల్ చేస్తున్నారు.మంగళవారం తెల్లవారుజామున జగన్నాథ పెట్రోల్ బంకులో నిలిపి ఉంచిన లారీలలో డీజిల్ దొంగిలిస్తూ సిబ్బందికి నలుగురు యువకులు కంటపడ్డాడు.సిబ్బంది కేకలు వేయడంతో దొంగలు పరారైయ్యారు,పరిపోయే క్రమంలో బైకులను వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి బైకులు తీసుకునేందుకు పెట్రోల్ బంక్ దగ్గరకు ఇద్దరు రావడంతో సిబ్బంది వారిని పట్టుకుని పెట్రోల్ బాంక్ యజమానికి సమాచారం అందించడంతో దొంగలను పోలీసులకు అప్పగించారు.ప్రస్తుతం ఇద్దరు దొంగలు నరసరావుపేట టు టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారు.