గుత్తి మున్సిపాలిటీ పరిధిలో చెత్త కుండీలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో చెత్తకుండీలో వేసిన చెత్తంతా తిరిగి రోడ్ల, ఇండ్ల ముందు పడుతున్నది. కనీసం మున్సిపల్ అధికారులు చెత్తకుండీలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. చెత్తకుండీలు అధ్వానంగా ఉండడంతో జనాలకు చెత్త ఎక్కడ పడే వేయాలో తెలియడం లేదు. దీంతో రోడ్లపైనే చెత్త పడేస్తున్నారు. చెత్తకుండీలోని చెత్త అంతా రోడ్లపై పడుతుండడంతో దుర్వాసన వెదజల్లుతున్నది. ప్రజారోగ్యం దెబ్బతింటున్నది.