Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి గత కొద్దిరోజులుగా వరద కొనసాగుతుంది. మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 22, 868 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 58.080 TMCల నీటిమట్టం నమోదైంది. రైతుల అవసరాల కోసం పెన్నా డెల్టాకు 1,850, కండలేరుకు 10,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.