విజయనగరం జిల్లా జామి మండలంలోని అలమండ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని విజయనగరం రైల్వే హెచ్సీ వి. అశోక్ శుక్రవారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందన్నారు. అతడు 5.5 అడుగుల పొడవు, చామన చాయ రంగులో ఉన్నాడన్నారు. ఎరుపు రంగుపై తెలుపు గడల షర్ట్, నీలం రంగు నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు.