వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై సమీప బంధువు దాడి చేసి గాయపరిచాడు. తన మరదలతోనే గొడవకు దిగుతావా అంటూ అజీమా అనే మహిళపై గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆమెపై దాడి చేసి ఆమె వేలిని నోటితో కొరికేశాడు. ద గాయపడిన ఆమెని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అబ్దుల్ కలాంతో పాటు అతని స్నేహితులపై వేదయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.