కౌతాళం :మండలం ఏరిగేరి గ్రామంలో ఆధ్యాత్మిక వ్యక్తిగా పేరుగాంచిన చిరుతపల్లి లక్ష్మయ్య గారు దైవ దర్శనానికి వెళ్లి సోమవారం కర్ణాటక రాష్ట్రంలోని అనగోంది గ్రామం దగ్గర తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు .ఈ విషయం తెలుసుకున్న కౌతాళం సింగర్ విండో చైర్మన్ వెంకటపతి రాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఏరిగేరి గ్రామంలో లక్ష్మయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.