నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉధృత రూపాన్ని దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రవాహం అధికమైంది. బాసర వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నీరు ఎగసిపడడంతో పలు లాడ్జీలు, వ్యాపార సంస్థలు జలమయం కాగా, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల బాసరలో పర్యటించారు. స్వయంగా ట్రాక్టర్ పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద