హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కోతకు గురైంది. ఎగువన వర్షాలు కురవడంతో చింతకుంట వద్ద కట్ర వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వంతెన కోతకు గురి కావడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జాతీయ రహదారి వంతెన కొన్నేళ్ల నుంచి పూర్తి కాకపోవడంతో ఈ సమస్య వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.