నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో విఆర్ఎస్ నాయకులు కడారి పెద్దయ్య పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ అన్నారు. గ్రామాలలోని అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని అన్నారు. దాడికి గురైన కడారి పెద్దయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించారు. వచ్చే రోజులు తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు.