అంగన్వాడి,ఐకెపి వివోఏ, ఆశా,మధ్యాహ్న భోజన తదితర రంగాలలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని CITU మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్ అన్నారు. శనివారం కెరమెరిలో వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. చాలీ చాలని వేతనాలతో ఆ ఉద్యోగులు పని చేస్తుంటే వారికి సరైన వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు.GP కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.