కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరియు తెలంగాణలోని మేడ్చల్‌కు చెందిన 99వ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బెటాలియన్‌తో కలిసి, కమిషనరేట్ పరిధిలోని మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 4గంటలకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ , ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజలకు భరోసా కల్పించడం, భవిష్యత్తులో శాంతి భద్రతలను పెంపొందించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనలను నివారించడం "RAF సిబ్బందికి ఆ ప్రాంతాలపై అవగాహన పెంచడం, అని పోలీస్ కమీషనర్ తెలిపారు.