నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 26 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే గ్రౌండ్ లెవెలింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు సోమవారము 11:30 గంటల సమయంలో స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పనులకు సంబంధించిన నిధులను యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో సి ఎస్ ఆర్ ఫండ్స్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట క్రీడలకు క్రీడాకారులకు నిలయమని ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ క్రీడ ప్రతిభను చాటారని తెలిపారు.