జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ