తాడిపత్రిలో ఆదివారం జరుగునున్న వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సూచించారు. తాడిపత్రి లో శనివారం హిందూ-ముస్లిం మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరూ కలిసి ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శివప్రసాద్ పాల్గొన్నారు.