ఆలూరులో పల్లెకు పోదాం కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ బృందం శనివారం స్థానిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, చిన్నారులకు వడ్డించే భోజన నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వహించాలంటూ హెడ్ మాస్టర్లు, అంగన్వాడి టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల క్రితం ఆలూరు 4వ వార్డు ప్రాథమిక పాఠశాలలో జరిగిన ప్రమాదంపై ప్రత్యేక విచారణ చేపట్టారు.