ముంబై హైవేపై సహస్ర తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసుల విచారణతో తప్పుదోవ పాటిస్తున్నారని ఆరోపించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.