2013 సెప్టెంబర్ ఒకటి గురజాల చరిత్రలో మరుపురాని రోజు అని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా దాచేపల్లి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఓ సభలో భాగంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం పై ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. దాచేపల్లి మండలం పొందగల్లో తాము నిర్వహించిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర విజయవంతమై 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. 12 సంవత్సరాల తర్వాత సీఎం చంద్రబాబు ఈ విషయం స్వయంగా ప్రకటించడం విశేషం అన్నారు.