భూపాలపల్లి ఏరియాలోని 6 ఇంక్లైన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది... 6 ఫీట్ల బొగ్గు బండ కూలి ఓవర్ మేన్ తో పాటు కార్మికుడికి గాయాలయ్యాయి.. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు కార్మికుల ద్వారా తెలిసింది.. వివరాల్లోకి వెళితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కు చెందిన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్న రాదండి మొండయ్య అనే వ్యక్తి రోజువారి విధుల్లో భాగంగా సిక్సింగ్ లైన్ గనిలోకి దిగాడు అలాగే అతనితో పాటు ఓవర్ మెన్ కూడా ఉండగా ప్రమాదవశాత్తు బండకూలి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే తోటి కార్మికుల గమనించి వారిని చికిత్స నిమిత్తo తరలించారు.